VIDEO: 'సిద్దేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు'

HNK: జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా సిద్దేశ్వరుడికి అన్నాభిషేకం, కుంభహారతి, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సిద్దేశ్వరుడిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం భక్తుల సందడితో కళకళలాడింది.