గుంతకల్లులో "అగ్నిమాపక వారోత్సవాలు"
ATP: "అగ్నిమాపక వారోత్సవాలు" నేటి నుంచి 20వ తేదీవరకు అగ్నిమాపక సిబ్బంది నిర్వహించనున్నారు, అందులో భాగంగా గుంతకల్లులో మొదటి రోజు కసాపురం రోడ్డులో పల్లవి స్కూల్ నుంచి అగ్నిమాపక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా అశ్వర్థ్, అగ్నిమాపక అధికారి, అగ్నిమాపక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.