లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
కృష్ణా: చల్లపల్లి సెంటర్లో శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టారు. శనివారం ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరై శంకుస్థాపన చేశారు. రావెళ్ల ఉదయ్ కుమార్ రూ.15వేలు విరాళాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా అందచేశారు. ఏఎంసీ ఛైర్మన్ కనకదుర్గ, డీసీ చైర్మన్ దిలీప్, సర్పంచ్ కృష్ణకుమారి, యార్లగడ్డ శ్రీనివాస్ పాల్గొన్నారు.