గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం

గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం

KDP: సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామానికి చెందిన నంద (32) మూలపల్లె సమీపంలోని పెన్నా నదిలో శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. మృతదేహం ఆదివారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. కడప అగ్నిమాపక సిబ్బంది ఆచూకీ కోసం శనివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించి శవ పంచనామా నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.