ఆ సేవలు బంద్.. SBI కీలక ప్రకటన
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న 'ఎం-క్యాష్' సర్వీసును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 30 తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. కస్టమర్లకు ప్రత్యామ్నాయంగా UPI, IMPS, NEFT, RTGS వంటివి అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.