ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం రాచుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణించారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో పాక్‌లోని రావిల్పిండిలో ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసేందుకు ఆయన సోదరీమణులు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ సోదరికి జైలులోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతినిచ్చారు.