'పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి'

'పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి'

MNCL: మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలను సాధించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ సూచించారు. పూలే వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.