అమరజీవికి ఎస్పీ నివాళులు

అమరజీవికి ఎస్పీ నివాళులు

VZM: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పోలీస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు.