తాడంకిలో జూనియర్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

తాడంకిలో జూనియర్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

కృష్ణా: పమిడిముక్కల మండలం తాడంకి ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి.రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీలకు 01-01-2006 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.