తుఫాన్ ఎఫెక్ట్.. ప్రచార సభలు రద్దు
మొంథా తుఫాన్ ప్రభావంతో బీహార్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో సీఎం నీతీశ్ కుమార్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. దీంతో కొందరు నేతలు ఫోన్ల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.