కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
BHPL: గోదావరి పుష్కరాలను 2027లో జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వరంలో పుష్కరాలకు శాశ్వత నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పుష్కర ఘాట్లు, రోడ్ల విస్తరణ కోసం 14.36 ఎకరాల భూమిని గుర్తించింది. దీనిపై సర్కార్ ప్రణాళిక ప్రకటించాల్సి ఉంది.