బీజేపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎంపీపీ
CTR: పాలసముద్రం మండల వైసీపీ ఎంపీపీ శివ ప్రకాష్ రాజ్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాధవ్ అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నరేంద్ర మోదీ పాలన నచ్చి బీజేపీలో చేరినట్లు శివ ప్రకాష్ రాజు తెలిపారు.