శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకు ఏకాదశి పూజలు

శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకు  ఏకాదశి పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులో వెలిసిన ఏడుపాయల క్షేత్రంలో ఆదివారం అమ్మవారికి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం భాను వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళహారతి నైవేద్యం సమర్పించారు.