WWC ఫైనల్: మూడోసారైనా కప్పు చిక్కేనా..?
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరులో రేపు భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అయితే, ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ 12 సార్లు జరగ్గా.. 2005, 2017లో ట్రోఫీ గెలిచే అవకాశాన్ని భారత్ మిస్ చేసుకుంది. ఇప్పుడు మూడోసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్ సేన అదే జోరును సఫారీలపై కొనసాగిస్తే కప్పు కల నెరవేరినట్లే.