VIDEO: KU గ్రౌండ్లో సందడి

HNK: పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ ఉదయం నుంచి సందడిగా మారింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం నగరవాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మహిళలు, పురుషులు వాకింగ్, జాగింగ్ చేస్తుండగా, ఎస్సై, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత రన్నింగ్, ఫిజికల్ సాధనలో నిమగ్నమవుతున్నారు. చిన్నారులు, యువకులు వివిధ ఆటలతో చురుగ్గా గడుపుతున్నారు.