'ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి'
PDPL: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్‌లో ఇవాళ ఆయన ప్రజావాణిలో అదరపు కలెక్టర్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ నుంచి శ్రీనివాస్ వికలాంగ పింఛన్ కోసం, అందుగులపల్లికి చెందిన సంపూర్ణ ఇంటి బిల్లులు చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నారు.