VIDEO: శ్రీ గోదాదేవి అమ్మవారికి నీరాట్టోత్సవం
మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో శ్రీ గోదాదేవి అమ్మవారికి నీరాట్టోత్సవం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. వేద పండితులు షోడశోపచార పూజలు నిర్వహించి అమ్మవారిని పెళ్లికూతురు వేషధారణలో అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.