ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్
KMM: తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ప్రచారం, పోలింగ్ సరళిని చూసి ఎవరికీ వారు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు వార్డు సభ్యులుగా గెలిస్తే ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు మరికొందరు పావులు కదుపుతున్నారు. మరి లోకల్ కింగ్ ఎవరనేది తేలాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.