'ఆర్టెమిస్‌-2': చంద్రుడిపైకి యాత్ర

'ఆర్టెమిస్‌-2': చంద్రుడిపైకి యాత్ర

నాసా ప్రతిష్టాత్మక 'ఆర్టెమిస్‌-2' మిషన్ ద్వారా ఐదు దశాబ్దాల తర్వాత మానవులను తిరిగి చంద్రుడి చెంతకు చేరుస్తోంది. ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడా వ్యోమగామి జాబిల్లి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి వస్తారు. వ్యోమనౌకలోని వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఇది విజయవంతమైతే, ఆర్టెమిస్‌-3 ద్వారా మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం సుగమం అవుతుంది.