కష్టపడేవారికి జగన్ ఎప్పుడూ అవకాశం ఇస్తారు: రోజా
AP: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి జగన్ మాత్రమేనని మాజీ మంత్రి రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ, జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారని చెప్పారు.