నీటి గుంతలో పడి బాలుడి మృతి

KDP: కొండాపురం మండలంలోని దత్తాపురంకి చెందిన గంగాధర్ యాదవ్ కుమారుడు లడ్డు (7) ఇవాళ మధ్యాహ్నం వంక నీళ్లలో పడి మృతి చెందాడు. ఇవాళ సెలవు కావడంతో పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ వంక దగ్గరికి వెళ్లారు. ప్రమాదవశాత్తు వంక నీళ్లలో పడి లడ్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలికను కాపాడారు. కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.