'రైతును అభినందించిన అధికారులు'
ASR: గిరి రైతు ప్రయత్నాన్ని RySS–APCNF ఈడీ బాబురావు నాయుడు, డీపీఎం భాస్కరరావు అభినందించారు. హుకుంపేట మండలం బోడిగపుట్టు గ్రామ రైతు టి. రాజబాబు నిర్వహిస్తున్న “అటవి చైతన్య ద్రావణం” ప్రయోగ క్షేత్రాన్ని బుధవారం RySS అధికారులు పరిశీలించారు. ఈ ద్రావణం వల్ల పంటల పెరుగుదల, నేల సారవంతత మెరుగైనట్లు గుర్తించి రైతు ప్రయత్నాన్ని అభినందించారు.