మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధికి 500 ఎకరాలు
HYD: హిమాయత్ సాగర్, గండిపేట్ సమీపంలో ఉన్న 500 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ భూమిపై మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న వలంతరి, ఐఐపీహెచ్ వంటి సంస్థలను శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీలకు తరలించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాదుకు పర్యావరణ, పర్యాటక పరంగా కొత్త ఆకర్షణలు రానున్నాయి.