మహిళ పోలీసులతో ఎస్సై సమావేశం
VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సచివాలయ మహిళా పోలీసులతో ఎస్సై ఎన్.జోగారావు మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సైబర్ నేరాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో సి. సి.ఫుటేజ్‌లు ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరారు. తీర్థాలలో అశ్లీల నృత్యాలు అరికట్టాలని మహిళ పోలీసులకు సూచించారు. శక్తి యాప్ పై అవగాహన చేయాలన్నారు.