నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు
GDWL: కేటీ దొడ్డి మండల నూతన ఎస్సైగా శనివారం పి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని అన్నారు.