మూడవ రోజుకు చేరిన సెస్ ఉద్యోగుల దీక్ష
సిరిసిల్ల పట్టణంలోని సెస్ ఆఫీసు ముందు అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన దీక్ష మూడవరోజుకు చేరుకుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచాలని వారు పేర్కొన్నారు. చాలీచాలని జీతంతో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్ ఇప్పటికైనా స్పందించి తమను పర్మినెంట్ చేసి సాలరీ పెంచాలని కోరారు.