గ్రామాలలో బీజేపీ బలోపేతమే లక్ష్యం

గ్రామాలలో బీజేపీ బలోపేతమే లక్ష్యం

కోనసీమ: అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షుడు యనమదల వెంకటరమణ ముక్తేశ్వరంలో గురువారం సాయంత్రం మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. మండలంలోని ప్రతి బూత్‌‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలోనూ బీజేపీ నాయకులు పర్యటించాలని సూచించారు.