గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

NTR: కంచికచర్ల మండలం పరిటాల అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కంచికచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.