కట్కూర్ గ్రామ సర్పంచ్ బరిలో అడ్వకేట్
JN: బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ బల్ల రవీంద్రనాథ్ సర్పంచ్ పోటీలో నిలిచారు. పుట్టిన గ్రామంపై మమకారంతో తాను సర్పంచ్ బరిలో నిలిచానని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు మహిళా సాధికారత సూపరిపాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.