చెరువులో మృతదేహం లభ్యం

చెరువులో మృతదేహం లభ్యం

VKB: కోట్‌పల్లి మండలం ఇందోల్ గ్రామానికి చెందిన తలారి వెంకటయ్య నిన్న ఉదయం స్నానానికని వెళ్లి అదుపుతప్పి చెరువులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఉదయం 11 గంటలకు వెంకటయ్య మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి నలుగురు పిల్లలున్నారు.