పాలగిరిలో పర్యటించిన నరేన్ రెడ్డి

KDP: వైసీపీ కమలాపురం నాయకుడు నరేన్ రెడ్డి గురువారం పాలగిరి గ్రామంలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఒక్క వైసీపీతోనే సాధ్యమని ఆయన ప్రజలకు వివరించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని, సంక్షేమ పథకాలు తిరిగి అమలు అవుతాయన్నారు.