లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
BHPL: రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు కొడవటంచ చేరుకొని, శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆలయంలో పునః ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.