నేర రహిత సమాజమే లక్ష్యం: సీఐ
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం అమ్మోరుతోపు కాలనీలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. యువతకు డ్రగ్స్, సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేర రహిత సమాజమే లక్ష్యమన్నారు.