ఎంపీటీసీపై కత్తులతో దాడి.. వైసీపీ నాయకులు పరామర్శ
NDL: పచ్చని గ్రామాలలో చిచ్చు పెట్టవద్దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇవాళ టీడీపీ నాయకులను హెచ్చరించారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాథరెడ్డిపై టీడీపీ నాయకులు కత్తులు రాడ్లతో దాడి చేయడాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హరినాథరెడ్డిని ఆయన పరామర్శించారు.