VIDEO: కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా బైక్ ర్యాలీ

KRNL: కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా వెన్నుపోటు దినంగా బుధవారం పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. గ్రామం నుండి మంత్రాలయంకు వైసీపీ జెండాలను చేతబూని బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు.