'ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి'

WNP: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీ బారికేడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల చరిత్ర ఎంతో గొప్పదన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన కళాశాల ఇదని తెలిపారు.