స్వచ్ఛ రిక్షాలకు ఎమ్మెల్యే శ్రీకారం
PPM: గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రిక్షాలను ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఈ రిక్షాలను వినియోగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావుకు పలు సూచనలు చేశారు. గ్రామ పరిశుభ్రతకు ఈ రిక్షాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.