VIDEO: పొలాల్లో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

VIDEO: పొలాల్లో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణి గ్రామ పొలాల్లో వారం రోజులుగా చిరుత పులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తక్షణమే చిరుత పులిని బంధించి తమను రక్షించాలని వారు కోరుతున్నారు.