తాటి చెట్టు నుంచి జారి పడి గీత కార్మికుడు గాయాలు
WGL: వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి గ్రామంలో నల్లం సుధాకర్ గౌడ్ (40) అనే గీత కార్మికుడు కుల వృత్తిలో భాగంగా ఆదివారం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది.