తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు

SRCL: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు అన్యాయం జరిగిందని తంగళ్ళపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రైతుల ధాన్యం తడిసిపోయిందన్నారు.