రోడ్డుపై ధాన్యం రాశులు తొలిగేదే ఎన్నడో..!
MDK: చేగుంట మండలం, ఇబ్రహీంపూర్ నుంచి చేగుంట వెళ్లే రోడ్డు మార్గంలో రైతులు అధిక సంఖ్యలో ధాన్యం రాశులను ఆరబోశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కుప్పలు ఎప్పుడు తొలగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణించడం భయాందోళన కలిగిస్తోందని వాహనదారులు వాపోయారు.