నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలి మృతి

నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలి మృతి

కర్ణాటక శివమొగ్గలో దారుణం జరిగింది. వన్యప్రాణులకు చికిత్స చేసేందుకు వెళ్లిన డాక్టర్ సమీక్షారెడ్డిపై ఒక నీటి ఏనుగు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. బెంగళూరులో చెందిన సమీక్షారెడ్డి ఒప్పంద పద్ధతిలో త్యావరకొప్ప పులి సింహధామంలో సేవలు అందిస్తున్నారు. సన్ కాపర్ పక్షికి చికిత్స కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.