ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొమరోలు ప్రభుత్వ వైద్యాధికారి చైతన్య దీపక్ సూచించారు. 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎండలో తిరగరాదన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని కోరారు. కొబ్బరి నీరు, మజ్జిగ, పుచ్చకాయ రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.