కుసుమరాయి పరిసరాల్లో పెద్దపులి సంచారం

కుసుమరాయి పరిసరాల్లో పెద్దపులి సంచారం

AP: పోలవరం జిల్లా కుసుమరాయి పరిసరాల్లో పెద్దపులి సంచరించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలతో పులి కదలికలను పరిశీలిస్తున్న అధికారులు, మరో ప్రత్యేక బృందాన్ని శ్రీశైలం నుంచి రప్పిస్తున్నట్లు అటవీ శాఖాధికారి సుబ్బారెడ్డి తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.