BREAKING: లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి
HYD: చాంద్రాయణగుట్టలో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది.. కానీ లిఫ్ట్ పైకి రాకపోవడంతో ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి వృద్ధుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు భవనయజమాని నిర్లక్ష్యమే కారణం అంటూ అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.