పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

NLG: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పెసర యాదగిరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా అధికారులు విచారణ చేశారు. ఓ వ్యక్తికి చెందిన నివాస గృహాల మ్యూటేషన్ విషయంలో రిజిస్టర్‌లో మార్పులు చేశారని రుజువు కావడంతో కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేశారు.