ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: ఆస్పరి మండలంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేసుకోవాలని తహశీల్దారు రామేశ్వరరెడ్డి శనివారం అన్నారు. అర్హులైన వారు ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.