ఆక్విడెక్టును మరోసారి ముంచెత్తిన వరద నీరు
కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ధ కృష్ణానదిపై ఉన్న ఆక్విడెక్టును మరోసారి వరద నీరు ముంచెత్తింది. తుఫాన్ అనంతరం కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం ఇంకా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ధ నుంచి సముద్రంలోకి 4,22,004 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయటంతో ఆక్విడెక్టుకు వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు.