మెట్రో స్టేషన్ కింద పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..!
HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కింద డ్రైనేజీ నీరు రోడ్డుపై విపరీతంగా పొంగి పొర్లుతుందని స్థానికులు తెలిపారు. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే GHMC సిబ్బంది ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.