హస్మత్ పేటలో ప్రారంభమైన మిలాద్ ఉన్ నబి శోభయాత్ర

HYD: హస్మత్ పేటలో మిలాద్ ఉన్ నబి శోభయాత్ర ప్రారంభమైంది. పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో యాత్ర కొనసాగుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దాదాపుగా 1200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు వెళ్తున్నారని అధికారులు తెలియజేశారు. ప్రశాంతంగా యాత్ర పూర్తయ్యేలా అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.